నిందితులకు శిక్ష తప్పదు : ఆస్ట్రేలియా

FILE
భారత విద్యార్థులపై జాత్యహంకార దాడులకు పాల్పడినవారు ఎవరైనా సరే కఠినంగా శిక్షిస్తామని ఆస్ట్రేలియా ప్రభుత్వం పునరుద్ఘాటించింది. దాడుల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉండటంతో ఆందోళనలు తీవ్రతరంకాక తప్పవని గ్రహించిన ప్రభుత్వం... తాము విద్యార్థుల భద్రతకు కట్టుబడి ఉన్నట్లు పేర్కొంది.

ఈ సందర్భంగా ఆస్ట్రేలియా హై కమీషనర్ మాట్లాడుతూ... నిందితులను అదుపులోకి తీసుకోవడంలో పోలీసులు ప్రగతి సాధించారని, కేసులు పెట్టి విచారణ జరుపుతున్నామని ప్రకటించారు. అంతర్జాతీయ విద్యార్థుల రక్షణకు ఆస్ట్రేలియా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని, అపరాధులను చట్టపరంగా శిక్షిస్తుందని తేల్చి చెప్పారు.

Ganesh|
ఇదిలా ఉంటే... ఆస్ట్రేలియాలో భారత విద్యార్థులకు భద్రత కల్పించేందుకు భారత్‌కు చెందిన ప్రైవేట్ డిటెక్టివ్‌లతో ఆస్ట్రేలియా హై కమీషన్ ఉద్యోగులు చర్చలు జరిపినట్లుగా వచ్చిన వార్తలను హై కమీషనర్ ఖండించారు. ఇలాంటి తరహాకు చెందిన ఎలాంటి సమావేశాల్లోనూ తమ కమీషన్‌గానీ, ఉద్యోగులుగానీ పాల్గొనలేదని స్పష్టం చేశారు.


దీనిపై మరింత చదవండి :