నిరుపేదల్లా కనిపించండి: ఆసీస్ పోలీస్ బాస్..!

Racial Attaks
Ganesh|
FILE
దాడులనుంచి తప్పించుకోవాలంటే నిరుపేదల్లాగా కనిపించాలని భారతీయ విద్యార్థులకు విక్టోరియా పోలీసు అధిపతి సిమన్ ఓవర్‌లాండ్ సలహా ఇచ్చారు. భారత విద్యార్థులు దాడులకు లక్ష్యంగా మారకుండా ఉండాలంటే వారి దగ్గరుండే విలువైన వస్తువులు కనిపించకుండా దాచుకోవాలని.. విదేశీ విద్యార్థుల భద్రతా అంశంపై జరిగిన ఓ కార్యక్రమంలో సిమన్ వ్యాఖ్యానించారు.

ది ఏజ్ పత్రిక కథనం ప్రకారం... భారతీయుల దగ్గరుండే ఐపాడ్లు, విలువైన చేతి గడియారాలు, ఆభరణాలను కంటబడకుండా దాచేసుకుని, పేదవారిలా కనిపిస్తే, దాడి చేసేందుకు అవకాశం ఉండదని సిమన్ సూచించినట్లు తెలుస్తోంది. అలాగే ప్రమాదకర ప్రాంతాలలో రాత్రిపూట ప్రయాణాలను కూడా మానుకోవాలని ఆయన సూచించారు.

అయితే సిమన్ సలహాపై ఆస్ట్రేలియాలో నివసిస్తున్న భారతీయులు మండిపడుతున్నారు. అంతేగాకుండా ఆయన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు భారతీయ విద్యార్థి సమాఖ్ (ఫీసా) ప్రతినిధి గౌతమ్ గుప్తా మాట్లాడుతూ.. దుండగుల బారినుంచి రక్షించుకోమంటూ సిమన్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఆరోపించారు.

ఇదిలా ఉంటే.. సిమన్ వ్యాఖ్యాలను విక్టోరియా ప్రధాని జాన్ బంబ్రీ సమర్థించాడు. అలాగే దుండగుల బారినుంచి తప్పించుకునేందుకు విద్యార్థులకు సిమన్ కొన్ని సలహాలను మాత్రమే ఇచ్చారని విక్టోరియా ఇమ్మిగ్రెంట్ అండ్ రిఫ్యూజీ ఉమెన్ కొలిజన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మెల్బా మార్జిన్‌సన్ సమర్థించారు. కేవలం విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకునే ఆయనలా మాట్లాడారనీ, సిమన్ వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని ఆమె పేర్కొన్నారు.


దీనిపై మరింత చదవండి :