నేపాల్‌లో అరెస్టయిన భారతీయులకు విముక్తి

Ganesh|
చిన్నపిల్లలను అపహరించేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలతో అరెస్టయిన ఐదుగురు భారతీయులు విడుదలయ్యారు. నేరం ఆరోపించబడిన వ్యక్తులందరూ పర్యాటకులని తేలడంతో ఊపిరి పీల్చుకున్న పోలీసులు వారిని విడిచిపెట్టారు. కాగా... నిందితులపై మోపిన ఆరోపణలన్నీ నిరాధారాలని తేలడంతో వారిని విడిచిపెట్టామని నేపాల్ పోలీసులు వెల్లడించారు.

ఇదిలా ఉంటే... నేపాల్‌లోని తినహు జిల్లాకు చెందిన బందీపూర్ పట్టణంలో పిల్లలను ఫొటో తీస్తున్న ఐదుగురు భారతీయ యువకులను అక్కడి స్థానికులు వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పిల్లలను అపహరించేందుకు ప్రయత్నిస్తుంటే పట్టుకున్నామని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ దిశగా విచారణ చేపట్టిన పోలీసులకు ఆ యువకులందరూ పర్యాటకులేనని తెలియవచ్చింది. దీంతో వారిని విడిచిపెట్టేశారు. అరెస్టయిన వారందరూ చత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందినవారు కాగా... వీరిలో రచిత్ కుమార్ శెట్టి (28), అశోక్ యాదవ్ (32), సురేంద్ర కుమార్ పాండే (32), చంద్రశేఖర్ వర్మ (32), రమేశ్ కుమార్ (40)లు ఉన్నారు.


దీనిపై మరింత చదవండి :