పేద విద్యార్థులకు తానా, తామాల విరాళం

Ganesh|
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), మెట్రో అట్లాంటా తెలుగు సంఘం (తామా)ల ఆధ్వర్యంలో ఇండియానా పోలీస్ ప్రాంతంలో పేద విద్యార్థులకు స్కూలు బ్యాగులను పంపిణీ చేశారు. ఇందులో భాగంగా.. కాలేజీ పార్కు ఎలిమెంటరీ స్కూల్, అట్లాంటా ఉమెన్స్ డే షెల్టర్లకు 500 బ్యాగులను విరాళంగా అంద జేశారు.

ఈ సందర్భంగా తానా ఉపాధ్యక్షులు పూర్ణ వీరపనేని మాట్లాడుతూ... వివిధ రకాల చదువుల్లో రాణిస్తోన్న పేద విద్యార్థులకు చేయూతనివ్వాలనే ఉద్దేశ్యంతో తాము ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ప్రస్తుతం స్కూలు బ్యాగులను పంపిణీ చేశామని, భవిష్యత్తులో కూడా విద్యార్థులకు అవసరమైన సహాయాన్ని అందజేస్తామని పూర్ణ వెల్లడించారు.

ఇంకా ఈ కార్యక్రమంలో కాలేజీ పార్కు సిటీ కౌన్సిల్ మెంబర్ క్లే యాంబ్రోస్, తానా ఫౌండేషన్ కార్యదర్శి బి. సాంబశివరావు, తామా అధ్యక్షులు సత్యనారాయణరెడ్డి, తాతా మధు, డి. గోపీచంద్, కె. ప్రవీణ్, ఎల్. చౌదరి, ఎన్. శ్రీనివాస్, సీహెచ్ రమేష్, వై. అనిల్, ఎస్. హరీష్ తదితరులు పాల్గొన్నారు.


దీనిపై మరింత చదవండి :