గ్రామీణాభివృద్ధికి ఊతం ఇచ్చేలా బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీని... ప్రముఖ ఎన్నారై పారిశ్రామికవేత్త లార్డ్ స్వరాజ్ పాల్ అభినందించారు. భారతదేశం ప్రవేశపెట్టిన ఆర్థిక బడ్జెట్ చాలా బాగుందని, ఆర్థికమాంద్యం ప్రభావంతో ఉపాధి కరువైన వారికి ఇది ఆసరాగా నిలుస్తుందని ఆయన కితాబిచ్చారు.