దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిని కోల్పోయిన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దెబ్బమీద దెబ్బ తగులుతున్న ప్రస్తుత తరుణంలో.. ప్రవాసాంధ్రులు ఇతోధికంగా తమ సహాయ సహకారాలను అందించాలని ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య విజ్ఞప్తి చేశారు. కృష్ణా, తుంగభద్ర, హంద్రీ నదుల వరదలతో అతలాకుతలమైన బాధితులను ఇప్పటికే అన్నిరకాలుగా ఆదుకునేందుకు ముందుకు వచ్చిన ప్రవాసాంధ్రులకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.