ప్రవాస న్యాయవాదికి "ప్రైడ్ ఆఫ్ సిక్కు కమ్యూనిటీ" అవార్డు

Nri News
Ganesh|
FILE
ప్రవాస భారతీయుడు సర్ మోటా సింగ్ క్యూసీ.. ప్రతిష్టాత్మయునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) "ప్రైడ్ ఆఫ్ సిక్కు కమ్యూనిటీ అవార్డు"కు ఎంపికయ్యారు. యూకే న్యాయ విభాగంలో అత్యున్నత సేవలు చేసినందుకుగానూ సింగ్‌ను ఈ న్యాయ సేవా పురస్కారం వరించింది. కాగా.. ఈ అవార్డు తొలిసారిగా ఓ ప్రవాస భారతీయుడికి లభించటం విశేషంగా చెప్పవచ్చు.

సిక్కుల ఉగాది పర్వదినం అయిన "బైశాఖి" ఉత్సవాల రోజున బ్రిటీష్ సిక్కు అసోసియేషన్ లండన్‌లోని సౌత్ రూయిస్లిప్‌లో నిర్వహించిన అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో.. ఆ సంస్థ అధ్యక్షుడు రామి రాంగర్ చేతులమీదుగా సర్ మోటా సింగ్ ఈ అవార్డును అందుకున్నారు.

ఇదిలా ఉంటే.. చాలాసార్లు జీవిత సాఫల్య పురస్కారాల (లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు)ను అందుకున్న మోటా సింగ్, 1965లో బ్రిటీష్ బార్ కౌన్సిల్‌లో సభ్యుడిగా చేరారు. ఆ తరువాత పదకొండు సంవత్సరాల వయస్సులోనే క్వీన్స్ కౌన్సిల్‌లో ఉప న్యాయమూర్తిగా పదవిని చేపట్టారు. తద్వారా అతి పిన్న వయస్సులో ఆ పదవిని చేపట్టిన తొలి వ్యక్తిగా కూడా సింగ్ చరిత్ర సృష్టించారు.

కాగా.. మోటా సింగ్ ప్రైడ్ ఆఫ్ సిక్కు కమ్యూనిటీ అవార్డును అందుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో షాడో జస్టిస్ సెక్రటరీ డొమినిక్ గ్రీవ్, ఈలింగ్ సౌతాల్ ఎంపీ రవీందర్ శర్మ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఛైర్మన్ కేవీ కామత్ తదితరులు హాజరై, సింగ్‌కు అభినందనలు తెలియజేశారు.


దీనిపై మరింత చదవండి :