బ్రిటన్ పార్లమెంటులో సోమవారం ప్రవేశపెట్టనున్న బిల్లుగనుక ఆమోదం పొందినట్లయితే, అధికార లేబర్ పార్టీకి తాను విరాళం ఇచ్చే అర్హతను కోల్పోతానని... ప్రవాస భారతీయ పారిశ్రామిక వేత్త లార్డ్ స్వరాజ్ పాల్ అభిప్రాయపడ్డారు. కాగా... బ్రిటన్లో శాశ్వత నివాసం లేనివారు రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వకుండా నిషేధించాలని సదరు బిల్లులో ప్రతిపాదించటమే దీనికి కారణం.