బ్రిటన్‌లో విద్యార్థి వీసాల నిబంధనలు మరింత కఠినం..!

Ganesh|
WD
కొడాలి నాని- జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరూ స్వయానా అన్నదమ్ములు కాకపోయినప్పటికీ... అన్నదమ్ముల్లా కలసిమెలసి ఉంటారు. అటువంటిది తెలంగాణా- సమైక్యాంధ్ర ఉద్యమాలు వాళ్లిద్దర్నీ తలోదిక్కున విడదీసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సమైక్యాంధ్ర ధ్యేయంగా విద్యార్థులు చేస్తున్న పాదయాత్రను ప్రభుత్వం అడ్డుకోవడమే కాక వారిని అరెస్టు చేయడాన్ని కొడాలి నాని తీవ్రంగా ఖండించారు. తెరాస నాయకులపై నిప్పులు చెరిగారు.

అదుర్స్ సినిమాను అడ్డుకుంటామని సవాల్ విసిరినవారు ఎంతవరకు సఫలమయ్యారని విమర్శించారు. హైదరాబాదు గురించి మాట్లాడితే నాలుకలు కోస్తామన్న కేసీఆర్.. ఎంతమంది నాలుకలు కోశారని ప్రశ్నించారు...?

నాని వ్యాఖ్యలపై తెరాస మండిపడింది. జూనియర్ ఎన్టీఆర్ పదే పదే బతిమాలితే అదుర్స్ చిత్ర ప్రదర్శనను అడ్డుకోలేదనీ తెలిపింది. తాజాగా నాని అహంకారపూరిత వ్యాఖ్యలు ఉపసంహరించుకునేంత వరకూ తెలంగాణాలో జూనియర్ ఎన్టీఆర్ అదుర్స్ చిత్ర ప్రదర్శనను పూర్తిగా అడ్డుకోవాలని టీజేఏసి కన్వీనర్ కోదండరామ్ పిలుపునివ్వడంతో పరిస్థితి మారిపోయింది. ఆందోళనకారులు ఎన్టీఆర్ వాల్‌పోస్టర్లను చించివేయడమే కాక, ఎన్టీఆర్ స్టిల్స్‌పై చెప్పులతో కొట్టడం వంటి చర్యలకు పాల్పడ్డారు.

వీటన్నిటినీ చూసిన జూనియర్ ఎన్టీఆర్ "అన్న" నానిపై గుర్రుగా ఉన్నట్లు సమాచారం. అదుర్స్ గురించి మాట్లాడకుండా ఉండాల్సిందని ఏభిప్రాయపడినట్లు భోగట్టా. అయితే నాని మాత్రం సమైక్యాంధ్ర విద్యార్థులకు జరిగిన అవమానాన్ని తాను చూస్తు చేతులు ముడుచుకుని కూచోలేనని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. మరోవైపు కొడాలి నాని వ్యాఖ్యలపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించాలని తెలంగాణా వాదులు పట్టుబడుతున్నారు. మరి జూనియర్ ఎన్టీఆర్ ఏం చెపుతాడో వేచి చూడాలి!!


దీనిపై మరింత చదవండి :