జాత్యహంకారంతో భారతీయులపై విరుచుకుపడి దాడి చేసిన ముగ్గురు బ్రిటన్ టీనేజర్లు త్వరలోనే జైలు ఊచలు లెక్కించనున్నారు. కవల సోదరులైన జస్టిన్, లూక్‌లవ్‌డేల్‌లు.. మరో టీనేజర్ నికోలస్ గార్డెనర్ అనే ముగ్గురు యువకులు భారత సంతతికి చెందిన ఓ షాపు కీపర్ అశోక్ సెల్వంపై దాడికి పాల్పడ్డారు. అనంతరం మరో షాపులోకి చొరబడి భయోత్పాతం సృష్టించారు.