భారత సంతతికి చెందిన ప్రముఖ విద్యావేత్త భాస్కర్ సేన్ గుప్తా... బ్రిటీష్ అత్యున్నత శాస్త్రవేత్తల బృందానికి నాయకత్వం వహించనున్నారు. ఈశాన్య భారతదేశంలోని భూగర్భ జలాలలో ఆర్సినిక్ విష ప్రభావాన్ని నిరోధించేందుకు పరిశోధనలు జరుపనున్న శాస్త్రవేత్తల బృందానికి గుప్తా నాయకత్వం వహిస్తారని బెల్‌ఫాస్ట్ క్వీన్స్ యూనివర్సిటీ ప్రకటించింది.