తెలుగుభాష పునరుత్తేజానికి విశేషమైన సేవలందించిన సీపీ బ్రౌన్ సమాధి పునర్నిర్మాణానికై లండన్ తెలుగు సంఘం (తాల్) నడుం బిగించింది. ఈ మేరకు బ్రౌన్ జ్ఞాపకాలను పదిలపర్చుకునేందుకుగానూ కెన్సల్ గ్రీన్లో ఉన్న ఆయన సమాధిని తిరిగి నిర్మించేందుకు చర్యలు చేపట్టింది. లండన్లో నివసిస్తున్న ప్రముఖ తెలుగు సాహితీ వేత్త డాక్టర్ గూటాల కృష్ణమూర్తి... బ్రౌన్ సమాధిని పునర్నిర్మించే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.