ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థులపై వరుసగా జాత్యహంకార దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఆ దేశ ప్రతినిధుల బృందం జూలై నెలలో మన దేశానికి రానుందని ప్రవాస భారతీయ వ్యవహారాల శాఖా మంత్రి వయలార్ రవి న్యూఢిల్లీలో వెల్లడించారు. ఈ విషయమై వయలార్ రవి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... 17 మంది సభ్యులతో కూడిన ఆస్ట్రేలియా ప్రతినిధుల బృందంలో అక్కడి వర్సిటీల వీసీలతో పాటు ప్రజాప్రతినిధులు, పోలీసులు, ఎన్జీవోలు ఉంటారని పేర్కొన్నారు. ఈ బృందం మన దేశంలోని వివిధ నగరాలతో పాటు హైదరాబాద్‌ను కూడా సందర్శిస్తుందని ఆయన వివరించారు.