భారతదేశంలో విద్యా సహాయ కార్యక్రమాలకు సహాయం అందించే విషయానికి తాము కట్టుబడి ఉన్నామని.. బ్రిటన్ యువరాజు ప్రిన్స్ ఛార్లెస్ స్థాపించిన బ్రిటీష్ ఆసియన్ ట్రస్ట్ ప్రకటించింది. కాగా.. బ్రిటన్ పర్యటనలో ఉన్న భారత రాష్ట్రపతి శ్రీమతి ప్రతిభా పాటిల్ ఛార్లెస్‌ను కలిసిన అనంతరం ఈ ప్రకటన వెలువడటం గమనార్హం.