ప్రపంచ అగ్రరాజ్యం అమెరికాలో ఆర్థికమాంద్యం దెబ్బకు మరో ప్రవాసాంధ్రుడు బలయ్యాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం నగరానికి చెందిన చంద్రనారాయణ మూర్తి బొమ్మిడి (49) ఫ్లోరిడాలో సాఫ్ట్‌వేర్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఆర్థికమాంద్యం కారణంగా మనోవ్యధకు గురైన ఈయన గత కొద్దిరోజులుగా కోమాలో ఉంటూ, ఈనెల 9న ఆసుపత్రిలో మరణించారు.