ఆస్ట్రేలియాలో భారతీయుల రక్షణ కోసం అది చేస్తున్నాం, ఇది చేస్తున్నామంటూ అక్కడి ప్రభుత్వం ఎంతగా చెబుతున్నా.. జాత్యహంకార దాడులు మాత్రమ ఆగటం లేదు. తాజాగా సోమవారంనాడు నీరజ్ భరద్వాజ్ అనే భారత విద్యార్థిపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో నీరజ్ ఎడమకన్ను, ముక్కు, పక్కటెముకలకు తీవ్ర గాయాలు కాగా.. 90 శాతం మేర ధ్వంసమైన కన్ను మాత్రం పూర్తిగా కోల్పోయే పరిస్థితి ఏర్పడినట్లు ది ఏజ్ పత్రిక గురువారం వెల్లడించింది.