మెల్‌బోర్న్‌లో మరో భారతీయునిపై దాడి

Gulzar Ghouse|
ఆస్ట్రేలియాలో ఆంధ్రా యువకులపై జరిగిన దాడి ఘటన మరవక ముందే మరో భారతీయునిపై దాడి జరిగింది. బల్జిందర్‌ సింగ్‌ అనే సిక్కు యువకుని(25)పై దుండగులు కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో బల్జిందర్‌ కత్తిపోట్లకు గురై తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.

ఇద్దరు దుండుగులు సింగ్‌ను డబ్బు కోసం డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో సింగ్ తన మనీ పర్స్ తీసి ఇచ్చే లోపే అతని కడుపులో కత్తితో పొడిచారు. కత్తిపోటుకు గురైన సింగ్ అక్కడే కుప్ప కూలిపోవడంతో వారు నవ్వుకుంటూ వెళ్ళిపోయారని పోలీస్ అధికారి డారెల్ ఆలెన్ తెలిపారు.

కాగా సోమవారం భారతీయులపై జరిగిన దాడి కేసులో 17 ఏళ్ల యువకుడ్ని మెల్‌బోర్న్‌ పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మరో యువకుడ్ని కూడా ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.


దీనిపై మరింత చదవండి :