బహుళ సంస్కృతులకు కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించేందుకు.. విదేశీ విద్యార్థులకు ఆస్ట్రేలియా సురక్షిత ప్రాంతమేనని సందేశం ఇచ్చేందుకుగానూ.. విక్టోరియా ప్రభుత్వం ఆదివారం మెల్‌బోర్న్‌లో ఓ సామరస్య ర్యాలీని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో వందలాదిమంది భారతీయులతో పాటు వేలాదిమంది పాల్గొన్నారు.