యూకేలో అన్నమయ్య జయంతోత్సవాలు

Annamayya
Ganesh|
FILE
యూరోపియన్ తెలుగు అసోసియేషన్ (ఈటీఏ), తిరుమల తిరుపతి దేవస్థానంవారి ఆధ్వర్యంలో 601వ జయంతోత్సవాలను కన్నులపండువగా జరుపనున్నట్లు అధ్యక్షులు ఎం. రాజశేఖరరెడ్డి ఓ ప్రకటనలో తెలియజేశారు.

యూకేలోని బర్మింగ్‌హాంలోగల బాలాజీ దేవాలయంలో అక్టోబర్ 9వ తేదీన అన్నమయ్య జయంతోత్సవాలను జరుపనున్నారు. కాగా.. ఈ వేడుకల్లో పాల్గొనేవారు ముందుగానే తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఈ సందర్భంగా రాజశేఖర రెడ్డి వెల్లడించారు.

అదే విధంగా ఈటీఏ ద్వితీయ వార్షికోత్సవాలను పురస్కరించుకుని తెలుగు మహాసభలను కూడా ఏర్పాటు చేయనున్నట్లు రాజశేఖరరెడ్డి తెలియజేశారు. ఈ రెండు వేడుకలలోనూ తెలుగుదనం ఉట్టిపడేలా అనేక కార్యక్రమాలను రూపొందిస్తున్నామని ఆయన చెప్పారు. కాబట్టి.. ఈ వేడుకల్లో అధిక సంఖ్యలో ప్రవాసాంధ్రులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన అందరికీ విజ్ఞప్తి చేశారు.


దీనిపై మరింత చదవండి :