ప్రతిష్టాత్మక యేల్ యూనివర్సిటీలో శిక్షణ పొందటం ఓ గొప్ప అనుభూతినిస్తోందని భారత ఎంపీల బృందం వ్యాఖ్యానించింది. మరింతమంది ఎంపీలను ఇలాంటి పర్యటనలకు పంపాలని అభిప్రాయపడ్డ ఈ బృందం యేల్‌లో శిక్షణ తమ ఆలోచనా పరిధి విస్తృతికి దోహదపడిందని పేర్కొంది.