జాత్యహంకార దాడికి గురై గత వారం రోజులుగా చావు బ్రతుకులు మధ్య కొట్టు మిట్టాడుతున్న భారత సంతతి వృద్ధుడు ఎక్రముల్ హక్ (67) సోమవారంనాడు మరణించారు. లండన్‌లోని ఓ ఆసుపత్రిలో ఆయన మృతి చెందినట్లు స్కాట్లాండ్ పోలీసులు మీడియాకు వెల్లడించారు.