లేబర్ పార్టీకి విధేయుడినే..! : స్వరాజ్ పాల్

Ganesh|
FILE
లేబర్ పార్టీకి విరాళాలు ఇచ్చినా, ఇవ్వకపోయినా... లేబర్ పార్టీకి, ప్రధాని గోర్డాన్ బ్రౌన్‌కు తాను ప్రధాన మద్ధతుదారుడినేననీ, పార్టీ బాగుకోరేవాడినేనని ఎన్నారై పారిశ్రామిక వేత్త స్వరాజ్ పాల్ స్పష్టం చేశారు. తమ దేశ పౌరులు కానివారు రాజకీయ పార్టీలకు ఇచ్చే విరాళాలపై బ్రిటన్ ప్రభుత్వం నిషేధం విధించినా కూడా తాను లేబర్ పార్టీకి విధేయుడిగానే ఉంటానని ఆయన పేర్కొన్నారు.

తమ దేశంలో శాశ్వత నివాసం లేనివారు పన్ను మినహాయింపు పొందేందుకు రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడాన్ని అడ్డుకునే బిల్లును బ్రిటన్ పార్లమెంట్ ఇటీవలే ఆమోదించిన సంగతి తెలిసిందే. అయితే ఈ బిల్లు ఇంకా చట్ట రూపం దాల్చలేదు. ఈ నేపథ్యంలో లేబర్ పార్టీకి సుదీర్ఘకాలంగా సహాయకారిగా స్వరాజ్ పాల్ మాట్లాడుతూ... చట్టం ఏది చెబితే దాన్ని పాటించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.

ఇదిలా ఉంటే... రాబోయే ఎన్నికల్లో గోర్డాన్ బ్రౌన్ నేతృత్వంలోని లేబర్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ఈ సందర్భంగా స్వరాజ్ పాల్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల పోల్స్ తమ పార్టీకే అనుకూలంగా ఉన్నాయని ఆయన తెలిపారు. కాగా... హౌస్ ఆఫ్ లార్డ్స్‌కు డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికయిన పాల్.. ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించిన సంగతి పాఠకులకు విదితమే...!


దీనిపై మరింత చదవండి :