తమ పౌరులపై జరుగుతున్న దాడుల కేసులకు సంబంధించిన విచారణను వేగవంతం చేయాలని ఆస్ట్రేలియా ప్రభుత్వాన్ని కోరినట్లు కేంద్ర విదేశాంగ శాఖా మంత్రి ఎస్ఎమ్ కృష్ణ న్యూఢిల్లీలో వెల్లడించారు. అలాగే ఈ కేసులలో కొనసాగుతున్న విచారణలు ఏ స్థాయిలో ఉన్నాయన్న విషయం గురించి కూడా ఆసీస్‌తో మాట్లాడినట్లు ఆయన వివరించారు.