ఆస్ట్రేలియాలో జాత్యహంకార దాడులకు గురయిన భారతీయ విద్యార్థులను పరామర్శించేందుకు, అక్కడున్న తెలుగు ప్రజలందరిలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు... ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఒక బృందాన్ని అక్కడికి పంపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఆస్ట్రేలియా వెళ్లేందుకు అవసరమైన వీసా, తదితర ఏర్పాట్లు పూర్తి చేసుకుని, ఒకటి, రెండు రోజులలో ఈ బృందం ఆస్ట్రేలియాకు వెళ్లనుంది. ఈ బృందంలో తెదేపా పార్లమెంటరీ నేత నామా నాగేశ్వరరావు, పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిలు ఈ బృందంలో ఉంటారని ఆ పార్టీ వెల్లడించింది.