ఆస్ట్రేలియాలో భారత విద్యార్థులపై గత కొంతకాలంగా జరుగుతున్న జాత్యహంకార దాడుల నేపథ్యంలో, విద్యార్థుల రక్షణ కోసం ఆ దేశ విశ్వ విద్యాలయాలు పది సూత్రాల కార్యాచరణ ప్రణాళికను అమలుచేయనున్నట్లు... విశ్వవిద్యాలయాల చీఫ్ ఎగ్జిక్యూటివ్ గ్లెన్ విధర్స్ ఓ ప్రకటనలో వెల్లడించారు. పది సూత్రాల కార్యాచరణ ప్రణాళిక అమలు కోసం దేశ, రాష్ట్ర కేంద్రపాలిత ప్రాంతాల సంస్థలతో కలిసి పని చేస్తామని గ్లెన్ తెలిపారు.