ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థులపై జరుగుతున్న జాత్యహంకార దాడుల నేపథ్యంలో... విదేశాల్లోని మన విద్యార్థుల సంరక్షణ కోసం ప్రభుత్వం అన్ని చర్యలను చేపట్టింది. భారత విద్యార్థుల యోగక్షేమాలను చూసేందుకుగాను కొన్ని దేశాలలోని భారత దౌత్య రాయభార కార్యాలయాలలో ఒక్కో అధికారిని నియమించనున్నట్లు ప్రభుత్వం లోక్సభలో వెల్లడించింది.