వైఎస్సార్ దుర్మరణం : శోకసంద్రంలో ఎన్నారైలు

YSR
Ganesh|
FILE
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మరణవార్త విన్న ప్రవాస భారతీయులందరూ శోకసంద్రంలో మునిగిపోయారు. నిన్నటిదాకా ఆయన క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటూ పూజలు, ప్రార్థనలు నిర్వహించిన అమెరికా, యూకే, గల్ఫ్ తదితర దేశాలలో నివసిస్తోన్న ప్రవాసాంధ్రులు ఆయన ఇక తిరిగి రారని తెలిసి గుండెలవిసేలా రోదిస్తున్నారు.

వైఎస్సార్ ఆచూకీ గురించి ఆంధ్రప్రదేశ్‌లో నివసిస్తున్న తమ కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు ఫోన్లు చేసి ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకుంటున్న ఎన్నారైలు వైఎస్సార్ మృతి చెందిన విషయం తెలుసుకుని విషాదంలో మునిగిపోయారు. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి తెలుగు ప్రజల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్న వైఎస్సార్.. ప్రమాదంలో మరణించటం భాదాకరమని వారు వాపోతున్నారు.

ఇదిలా ఉంటే... చిత్తూరు జిల్లాలో ఆదివారం ఉదయం జరుగనున్న రచ్చబండ కార్యక్రమానికి హైదరాబాదు నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో వైఎస్సార్ బయల్దేరారు. అయితే మార్గమధ్యంలో నల్లమల అటవీప్రాంతంలోని రుద్రకోట కొండపై హెలీకాప్టర్ క్రాష్ అవటంతో ముఖ్యమంత్రి తన ఇతర సిబ్బంది నలుగురితోపాటు దుర్మరణం పాలయ్యారు.


దీనిపై మరింత చదవండి :