వైభవంగా జరిగిన టీడీఎఫ్ బతుకమ్మ సంబరాలు

Batukamma
Ganesh|
FILE
తెలంగాణా ప్రజానీకం అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే బతుకమ్మ పండుగ తెలంగాణా డెవలప్‌మెంట్ ఫోరం ఆధ్వర్యంలో వాషింగ్టన్‌లోని లేక్ ఫైర్‌ఫాక్స్ పార్కులో ఘనంగా జరిగాయి. వందలాదిమంది ప్రవాసాంధ్రులు ఉత్సాహంగా పాల్గొన్న ఈ బతుకమ్మ వేడుకలకు లెక్కకు మించి భక్తులు హాజరుకావటంలో లైక్ ఫైర్‌ఫాక్స్ పార్కు క్రిక్కిరిసిపోయింది.

రంగురంగుల పువ్వులతో బతుకమ్మలను అలంకరించే సంప్రదాయానికి అనుగుణంగా 350 మందికి పైగా వివిధ రంగుల్లో సంప్రదాయ దుస్తులు ధరించి ఉత్సవానికి హాజరవటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ బతుకమ్మ ఉత్సవాలను స్థానిక తెలుగు సంఘాలు, టీవీ 9, తెలంగాణ జాగృతి సంస్థల సహాయ సహకారాలతో వాషింగ్టన్‌లోని తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరం వలంటీర్లు నిర్వహించారు.

ఈ సంవత్సరపు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించి.. పలు కార్యక్రమాలను ఏర్పాటు చేయడంతోపాటు, తమ విలువైన సమయాన్ని వెచ్చించి కార్యదీక్షతో అహరహం శ్రమించిన వలంటీర్లకు టీడీఎఫ్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసింది. ఇదే సందర్భంగా ఉత్తమమైన బతుకమ్మలను రూపొందించిన నలుగురు మహిళలను మొదటి బహుమతితో టీడీఎఫ్ సత్కరించింది.


దీనిపై మరింత చదవండి :