ఆస్ట్రేలియాలో మూడు నెలల క్రితం జాత్యహంకార దాడికి గురైన తొలి భారతీయ విద్యార్థి శ్రావణ్ కుమార్ను భారత విదేశాంగమంత్రి ఎస్.ఎం. కృష్ణ పరామర్శించారు. ఆ దేశంలో తన ఐదురోజుల అధికారిక పర్యటనలో భాగంగా ఆదివారం రోజున కృష్ణ, శ్రావణ్ ఇంటికి వెళ్లి, అతడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అంతేగాకుండా, వ్యక్తిగత సాయంగా లక్ష రూపాయలను అందజేశారు.