శ్వేత సౌధంలో దీపావళి వేడుకల్ని ప్రారంభించిన ఒబామా

Obama
Ganesh|
FILE
శ్వేతసౌధంలో మొట్టమొదటిసారిగా దీపావళి వేడుకలు ఆట్టహాసంగా ప్రారంభమయ్యాయి. భారతీయ సంప్రదాయం ప్రకారం వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ అమెరికా అధ్యక్షుడు బారక్ హుస్సేన్ ఒబామా దీపావళి ప్రమిదను వెలిగించి వేడుకలను ఘనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా భారతీయులందరికీ దీపావళి పర్వదిన శుభాకాంక్షలను తెలియజేసిన ఒబామా.. పండుగ కానుకగా, అమెరికాలో నివసిస్తున్న ప్రవాస భారతీయులందరికీ "హెల్త్ పాలసీ"ని ప్రకటించారు. కాగా... మేరిలాండ్ శివవిష్ణు ఆలయ అర్చకులయిన నారాయణాచారి ఈ వేడుకల్లో భాగంగా లక్ష్మీపూజలు నిర్వహించారు.

ఇదిలా ఉంటే... అమెరికా చరిత్రలో ఆ దేశ అధ్యక్షుడు హాజరై, దీపావళి వేడుకలను జరుపుకోవటం ఇదే మొట్టమొదటిసారి. అలాగే ఈ వేడుకలను అధికారికంగా గుర్తించటం, అధ్యక్ష భవనం అయిన వైట్‌హౌస్‌లో ఆట్టహాసంగా నిర్వహించటం కూడా ఇదే తొలిసారి కావడం గమనార్హం. ప్రపంచం మొత్తంమీదా మిలియన్ల సంఖ్యలో గల హిందువులు, సిక్కులు, జైనులు ఈ దీపావళి పర్వదినాన్ని అక్టోబర్ 17వ తేదీన వైభవంగా జరుపుకోనున్న సంగతి తెలిసిందే..!


దీనిపై మరింత చదవండి :