ఇటీవలనే ఒక సింగపూర్ నౌకను హైజాక్ చేసి ఇద్దరు భారతీయులను బందీలుగా చేసుకున్న సోమాలియా సముద్రపు దొంగలు తాజాగా మరో భారతీయ నౌకను హైజాక్ చేశారు. సీషెల్స్ సమీపం నుంచి పనామా వెళ్తున్న ఎంవీ ఏవన్ ఖాలిక్ అనే నౌకపై సోమాలియా పైరేట్లు దాడిచేసి అందులోని 26 మందిని అదుపులోకి తీసుకున్నారు.