"స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్"గా పరమ్‌జీత్ సింగ్

FILE
ఆస్ట్రేలియాలో చదువుకుంటున్న భారత విద్యార్థి పరమ్‌జీత్ సింగ్ (21)ను వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీ "ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్" అనే అవార్డుకు ఎంపిక చేసింది. పంజాబ్‌లోని అమృత్‌సర్‌కి చెందిన సింగ్ 2008 సంవత్సరానికిగానూ ఈ అవార్డుకు ఎంపికయిన 35 మందిలో ఒకరిగా నిలిచాడు.

మౌంట్ డ్రుయిట్ కాలేజీ నుంచి ఐడీ (సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్)లో రెండు సంవత్సరాల డిప్లమా కోర్సును చేసిన పరమ్‌జీత్ సింగ్... వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీలో బ్యాచిలర్ డిగ్రీ చదివేందుకు ఈ సంవత్సరం తన పేరును నమోదు చేసుకున్నాడు. గత సంవత్సరం పేర్లు నమోదు చేసుకున్న 80 వేల మందికిపైగా విద్యార్థుల్లోంచి 35 మందిని మాత్రమే యూనివర్సిటీ ఈ అవార్డుకు ఎంపిక చేసింది. అందులో ఒకరిగా సింగ్ అవార్డును కైవసం చేసుకున్నాడు.

Ganesh|
ఈ సందర్భంగా పరమ్‌జీత్ సింగ్ మాట్లాడుతూ... ఈ అవార్డుకు తాను ఎంపికయ్యానన్న వార్త మొదట వినగానే చాలా ఆశ్చర్యానికి లోనయ్యానని అన్నాడు. అయితే దాన్నిప్పుడు ఓ స్ఫూర్తిగా తీసుకుంటున్నానని, మరింత అంకితభావంతో చదివి, ఎంచుకున్న రంగంలో అగ్రశ్రేణికి చేరాలనుకుంటున్నానని ధీమా వ్యక్తం చేశాడు. కాగా.. వరుస దాడులతో భీతిల్లుతోన్న భారత విద్యార్థులు సింగ్ అవార్డుకు ఎంపిక కావడం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.


దీనిపై మరింత చదవండి :