భారతీయ వైద్యుడు మహ్మద్ హనీఫ్ కేసు విచారణలో తనకు పూర్తి అధికారాలు ఇవ్వలేదని న్యూసౌత్‌వేల్స్ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జాన్ క్లార్క్ ఆరోపించారు. దర్యాప్తు సమయంలో రక్షణ సంస్థలు సమన్వయం లేకుండా పనిచేశాయనీ ఆయన ధ్వజమెత్తారు. హనీఫ్‌ను అక్రమంగా నిర్బంధించటం వెనుకనున్న రాజకీయ కుట్రను బహిర్గతం చేసేందుకు తనకు పూర్తి అధికారాలు ఇవ్వలేదని జాన్ క్లార్క్ ఆరోపించినట్లు ద ఏజ్ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది...