హార్వర్డ్ బిజినెస్ స్కూల్ డీన్‌గా ప్రవాస భారతీయుడు

Nri News
Ganesh|
FILE
ప్రపంచ ప్రఖ్యాతి చెందిన హార్వర్డ్ బిజినెస్ స్కూల్ (హెచ్‌బీఎస్) పదవ డీన్‌గా భారత సంతతికి చెందిన ప్రవాస భారతీయుడు నితిన్ నోహ్రియా ఎన్నికయ్యారు. కాగా.. 102 సంవత్సరాల హెచ్‌బీఎస్ చరిత్రలో ఓ భారతీయ సంతతి వ్యక్తి డీన్‌గా ఎంపికవటం ఇదే తొలిసారి కావటం విశేషంగా చెప్పవచ్చు.

హెచ్‌బీఎస్‌కు ఇప్పటిదాకా డీన్‌గా వ్యవహరిస్తున్న జే లైట్ స్థానంలో నితిన్ నోహ్రియా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌లోని రిచర్డ్ పి. చాప్‌మన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్న నోహ్రియా, వచ్చే జూలై నుంచి డీన్‌గా పదవీ బాధ్యతలు స్వీకరిస్తారని బిజినెస్ స్కూల్ అధ్యక్షుడు డ్రివ్ ఫాస్ట్ ఓ ప్రకటనలో వెల్లడించారు.

ఇదిలా ఉంటే.. హెచ్‌బీఎస్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన నోహ్రియా డీన్ స్థాయికి ఎదగటం గమనార్హం. ఈ మేరకు బిజినెస్ స్కూల్ అధ్యక్షుడు ఫాస్ట్ మాట్లాడుతూ.. నితిన్‌ను డీన్‌గా ఎంపిక చేయటం హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌కు, బిజినెస్ ఎడ్యుకేషన్‌కు శుభ పరిణామమని అన్నారు. విజయవంతమైన స్కాలర్‌గా, ఉపాధ్యాయుడిగా, మెంటర్‌గా పలు రకాల సేవలు అందించిన నితిన్, డీన్ పదవికి సరైన వ్యక్తని ఫాస్ట్ వ్యాఖ్యానించారు.


దీనిపై మరింత చదవండి :