అమెరికా ప్రజలందరూ హిందువులుగా మారిపోతున్నారనీ.. అమెరికన్ల మత విశ్వాసాలు, భావనలు రోజు రోజుకూ హిందూమతానికి దగ్గరవుతున్నాయని న్యూస్‌వీక్ పత్రిక వెల్లడించింది. ఈ పత్రిక మత విషయాల సంపాదకుడు లీసా మిల్లర్ ఇప్పుడు మనమంతా హిందువులమే అనే పేరుతో ఓ వ్యాసాన్ని రాశారు.