ఆస్ట్రేలియాలో ప్రైవేట్ విద్యా సంస్థల ఆగడాలకు అంతూపొంతూ లేకుండా పోతోంది. వివిధ రకాల ఫీజుల పేరుతో విదేశీ విద్యార్థులను ముప్పతిప్పలు పెడుతూ, ఇష్టానుసారం వసూళ్లకు పాల్పడుతున్న ఆ ప్రైవేట్ విద్యా సంస్థలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే విదేశీ విద్యార్థులపై జరిగిన జాత్యహంకార దాడులతో పరువు పోగొట్టుకున్న ఆస్ట్రేలియా ప్రభుత్వానికి ప్రైవేట్ విద్యాసంస్థల తీరు మరింత తలనొప్పిగా తయారయ్యిందనే చెప్పవచ్చు...