టీడీఎఫ్ ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ

batukamma
Ganesh|
FILE
అమెరికాలోని తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం (టీడీఎఫ్) ఆధ్వర్యంలో సెప్టెంబర్ 20వ తేదీన బతుకమ్మ పండుగ, సమ్మర్ పిక్నిక్‌లను నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. సెప్టెంబర్ 20 ఆదివారం ఉదయం 11.30 నుంటి సాయంత్రం 6 గంటల మధ్య బతుకమ్మ పండుగను అత్యంత వైభవంగా జరపతలపెట్టినట్లు టీడీఎఫ్ వెల్లడించింది.

ఈ సందర్భంగా టీడీఎఫ్ న్యూజెర్సీ, న్యూయార్క్, ఫిలడెల్ఫియా చాప్టర్స్ ప్రతినిధి మురళి చింతల్పని మాట్లాడుతూ... న్యూజెర్సీలోని గ్రోవ్ 4, ఫోర్స్ గేట్ డాక్టర్ మన్రో ప్రాంతంలోని థామ్సన్ పార్కులో ఈ బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఓ ప్రకటనలో తెలియజేశారు.

బతుకమ్మ పండుగ, సమ్మర్ పిక్నిక్‌ల సందర్భంగా ఆ రోజంతా అమెరికాలోని ప్రవాసాంధ్రులు హాజరై ఉత్సవాల్లో పాల్గొంటారని మురళి వివరించారు. ఈ వేడుకల్లో పురుషులు, మహిళలు, చిన్నారులకు వివిధ రకాల ఆటల పోటీలను కూడా నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సంబరాలకు హాజరయ్యేవారు, వారికి ఇష్టమైన ఆహార పదార్థాలను తయారు చేసుకుని వచ్చి అందరితో కలిసి ఆనందంగా పంచుకోవచ్చునని కూడా మురళి తెలిపారు.


దీనిపై మరింత చదవండి :