భారత సంతతికి చెందిన బ్రిటన్ మహిళ మంజిత్ కౌర్ కులార్, రెండు సంవత్సరాల క్రితం పంజాబ్‌లో మరణించారు. అయితే రోడ్డు ప్రమాదంలో మరణించిందని చెప్పబడ్డ ఆమె హత్యకు గురయ్యిందనీ, ఆ హత్య చేసింది ఆమె భర్త జగ్‌పాల్ సింగ్ కులార్ అని స్కాట్లాండ్ పోలీసులు కనుగొన్నారు. బ్రిటన్‌కు చట్ట విరుద్ధంగా వెళ్లిన జగ్‌పాల్ కేవలం బ్రిటన్ పౌరసత్వం కోసమే అమాయకురాలైన మంజీత్‌ను పెళ్లి చేసుకుని, ఆపై ఏమీ ఎరగనట్లు ఆమెను హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.