ఎన్నారై మహిళపై అఘాయిత్యం..!

nri women
Ganesh|
FILE
కెనడా నుంచి వచ్చిన ఓ ఎన్నారై మహిళపట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించి, అఘాయిత్యానికి పాల్పడిన ఓ పోలీస్ అధికారిని విధుల నుంచి సస్పెండ్ చేశారు. పంజాబ్‌లోని మోగా ఎన్నారై పోలీస్ స్టేషన్‌లో ఎస్‌హెచ్‌ఓగా పనిచేస్తున్న భూపీందర్ సింగ్ సదరు కెనడా మహిళపట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించినట్లు కేసు నమోదయ్యింది.

సహాయం కోసం వచ్చిన తనను భూపీందర్ సింగ్ హోటల్‌కు రమ్మన్నాడనీ, సాయం చేస్తాడని నమ్మి హోటల్‌కు వెళితే తనపై అత్యాచారయత్నం చేశాడని బాధితురాలు ఆరోపిచింది. అంతేగాకుండా.. తన వద్ద నుంచి ఇంపోర్టెడ్ వస్తువులు కూడా అతను లాక్కున్నాడని ఆమె తెలిపింది. దీంతో ఈ వ్యవహారంపై విచారణ జరపాలని మోగా ఎస్పీ అశోక్ బాత్ ఆదేశించారు.

ఇదిలా ఉంటే... తనను పెళ్లి చేసుకున్న రెండో భర్తకు వ్యతిరేకంగా మోగా ఎన్నారై పోలీస్ స్టేషన్‌ను ఈ ఆశ్రయించింది. తన భర్త, అతడికి పంజాబ్‌లో జరిగిన మొదటి పెళ్లిని దాచిపెట్టి, కెనడా పౌరసత్వం కోసం తనను వివాహం చేసుకుని తనను మోసం చేశాడని, ఈ విషయంలో న్యాయం చేయమని పోలీస్ స్టేషన్‌కు వెళితే.. ఇలాంటి దారుణాన్ని ఎదుర్కోవాల్సి వచ్చిందని ఆమె వాపోయింది.


దీనిపై మరింత చదవండి :