కార్తీక అప్పీలు చేసుకోవచ్చు : రజాక్

lady
Ganesh|
FILE
కోర్టు విధించిన శిక్షను ఎత్తివేయాలని కోరుతూ ముస్లిం మోడల్ కార్తీక సుకర్నో అప్పీలు చేసుకోవచ్చునని మలేషియా ప్రధానమంత్రి నజీబ్ తున్ రజాక్ పేర్కొన్నారు. ఇందుకోసం ప్రభుత్వ వర్గాలు కూడా సానుకూలంగా స్పందిస్తాయన్న నమ్మకం తనకుందని ఆయన అన్నారు.

కార్తీక షరియా కోర్టు విధించిన శిక్షకు తలొగ్గాల్సిన అవసరం లేదనీ, అప్పీలు చేసుకునేందుకు ఆమెకు ఇప్పటికీ అవకాశం ఉందని రజాక్ వ్యాఖ్యానించారు. అయితే ఈ ప్రతిపాదనను తిరస్కరించిన కార్తీక... శిక్ష అమలు చేయకపోతే తానే బహిరంగంగా శిక్ష విధించుకుంటానని చెప్పారు.

ఇదిలా ఉంటే... బహిరంగంగా మద్యం సేవిస్తూ పట్టుబడిన కార్తీక సుకర్నోకు పహాంగ్ షరియా హైకోర్టు 7 వేల రింగిట్లు జరిమానా, వారం రోజుల జైలు శిక్షతో పాటు ఆరు కొరడా దెబ్బలను శిక్షగా విధించిన సంగతి తెలిసిందే. అయితే పవిత్ర రంజాన్ మాసం వెళ్లేంతవరకూ ఆమెకు విధించిన శిక్షను సోమవారంనాడు వాయిదా వేసిన విషయం పాఠకులకు విదితమే..!!


దీనిపై మరింత చదవండి :