జాతి వివక్ష దాడి కాదు : మహిళా విలేకరి

Ganesh|
FILE
తనపై జరిగిన దాడి జాతి వివక్షతో కూడుకున్నదని తాను భావించటం లేదని, దుండగుడు తనను హిందీ భాషలో భయపెట్టేందుకు ప్రయత్నించాడని, చూసేందుకు భారతీయుడిలాగానే ఉన్నాడని... ఇటీవల ఆస్ట్రేలియాలో దాడికి గురయిన మహిళా విలేకరి పేర్కొన్నారు. అయితే భారత మీడియాలో ఇందుకు భిన్నంగా వార్తలు రావడం తనను ఎంతగానో బాధించిందని ఆమె వాపోయారు.

ఆస్ట్రేలియన్ డైలీ పత్రిక కథనం ప్రకారం... తనపై జాత్యహంకార దాడి జరిగిందని అనుకోవటం లేదని మహిళా విలేకరి స్పష్టం చేశారు. తనపై ఆస్ట్రేలియాలో జాతివివక్ష దాడి జరిగిందంటూ భారత మీడియా వెల్లడి చేయటం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని ఆమె వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉంటే... ఆస్ట్రేలియాలోని విద్యా కేంద్రాలలో చోటు చేసుకుంటున్న చీకటి కోణాలపై రహస్య దర్యాప్తును చేస్తున్న ఈ భారత మహిళా జర్నలిస్టుపై ఇటీవల దాడి జరిగిన సంగతి తెలిసిందే. గతంలో రెండు బెదిరింపు ఫోన్‌కాల్స్ కూడా ఎదుర్కొన్న ఈమెపై.. గత శనివారం మధ్యాహ్నం ఇన్నర్-సిటీ సిడ్నీ స్ట్రీట్‌లో తలపాగా ధరించిన ఓ వ్యక్తి దాడిచేసి గాయపర్చిన సంగతి విదితమే...!


దీనిపై మరింత చదవండి :