కువైట్ సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన నలుగురు మహిళలు ఆదేశ పార్లమెంట్‌కు తొలిసారిగా ఎంపికై చరిత్ర సృష్టించారు. వీరిలో... అసీల్ అల్ అవధి, రులా దస్తీ మరియు 2005లో మొట్టమొదటి మహిళా మంత్రిగా పనిచేసిన మాజీ ఆరోగ్య మంత్రి మస్సౌమా అల్ ముబారక్, సల్వా అల్ జాసర్ అనే నలుగురు మహిళలు ఉన్నారు. ఫలితాల అనంతరం అవధి మాట్లాడుతూ... కువైట్ ప్రజాస్వామ్యంలో మహిళలకు దక్కిన విజయమని సంతోషం వ్యక్తం చేశారు. తాను ఖచ్చితంగా విజయం సాధిస్తానని తెలుసని, అయితే రెండో స్థానంలో నిలుస్తానని మాత్రం ఊహించలేదని ఆమె అన్నారు.