నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ (ఎన్జీవో) సంస్థ అయిన నవ్‌జ్యోతి ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడిచే గ్లోబల్ ఆర్మ్‌ను భారత దేశపు తొలి మహిళా ఐపీఎస్ అధికారిణి, మెగస్సెసే అవార్డు గ్రహీత కిరణ్ బేడీ ప్రారంభించారు. భారత్‌లో పాఠశాలలను ప్రారంభించాలంటూ ప్రవాస భారతీయులు చేసిన విజ్ఞప్తికి స్పందించిన ఆమె, విద్యా సంబంధిత స్పాన్సర్షిప్ ప్రోగ్రాములను అందించే లక్ష్యంతో ఈ గ్లోబల్ ఆర్మ్‌ను ఏర్పాటు చేశారు.