బ్రిటన్‌లోని కేంబ్రిడ్జిషైర్‌లోని స్ట్రెంథామ్‌లో నివసిస్తున్న 41 సంవత్సరాల భారత సంతతి మహిళ రేఖా కుమారి బాకర్ తన సొంత పిల్లలైన దేవినా (16), జాస్మిన్ (13)లను అత్యంత కిరాతకంగా హతమార్చింది. నిద్రిస్తున్న పిల్లల్ని కత్తితో విచక్షణా రహితంగా పొడిచి చంపేసిన ఆమె ఏకంగా తన స్నేహితురాలైన కానిస్టేబుల్‌కు ఫోన్ చేసి ఘోరం చేశాను, పిల్లల్ని చంపేశాను అంటూ విలపించినట్లు తెలుస్తోంది.