పురంధరేశ్వరి గౌరవార్థం ప్రత్యేక సమావేశం

Purandharewari
Ganesh|
FILE
చికాగోలో రెండు రోజులుగా నిర్వహించిన పాన్ ఐఐటీ సదస్సు ముగింపు సందర్భంగా భారత కేంద్ర మంత్రి శ్రీమతి పురంధరేశ్వరి గౌరవార్థం భారతీయ రాయబారి శారదామీనన్, ఇండియన్ కౌన్సిల్ జనరల్ అశోక్‌లు ఓ ప్రత్యేక ముగింపు సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సమావేశం సందర్భంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలలో సంభవించిన వరదల ధాటికి సర్వస్వం కోల్పోయిన బాధితులను ఆదుకునేందుకుగానూ.. చికాగోలో స్థిరపడిన రాజేష్ పటేల్ 10వేలు, అక్కినేని సుదర్శన్ 5 వేలు, డాక్టర్ రావు ఆచంట 5 వేల అమెరిన్ డాలర్లను సహాయం చేసేందుకు ముందుకొచ్చారు.

అదే విధంగా వరద బాధితుల సహాయార్థం నిధులను సమీకరించేందుకుగాను న్యూజెర్సీలో స్థిరపడిన ప్రవాస భారతీయులు అక్టోబర్ 18వ తేదీన కేంద్రమంత్రి పురంధరేశ్వరి సమక్షంలో మరో ప్రత్యేక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయనున్నట్లు శారదా మీనన్ కార్యాలయ వర్గాలు ఈ మేరకు వెల్లడించాయి.


దీనిపై మరింత చదవండి :