ఫోర్బ్స్ మ్యాగజైన్ రూపొందించిన ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో పెప్సికో సీఈఓ, ప్రవాస భారతీయురాలు అయిన ఇంద్రానూయి ఈసారి కూడా మూడో స్థానాన్ని దక్కించుకున్నారు. అత్యంత ప్రజాదరణ, సామర్థ్యంతో కూడిన మహిళలతో ఈ జాబితాను రూపొందించినట్లు ఫోర్బ్స్ ఈ సందర్భంగా ప్రకటించింది.