బ్రిటన్, సైప్రస్ దేశాల ఏడు రోజుల పర్యటనను విజయవంతంగా ముగించుకుని స్వదేశానికి తిరిగివచ్చిన భారత రాష్ట్రపతి శ్రీమతి ప్రతిభా పాటిల్.. ఆ రెండు దేశాల పర్యటన మరపురానిదని సంతోషం వ్యక్తం చేశారు. ఆదివారం న్యూఢిల్లీ చేరుకున్న రాష్ట్రపతి...మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. ఇండియా హౌస్లో జరిగిన విందును తాను మరచిపోలేనని, అలాగే మన మిత్రదేశమైన సైప్రస్ ఆతిథ్యం కూడా అమోఘమని అభివర్ణించారు.