మలేషియాలో ఎన్నారై మహిళకు విముక్తి

women
Ganesh|
FILE
లైంగిక వేధింపులకు గురిచిసిన తోటి ఉద్యోగిని హత్య చేసిన ప్రవాస భారతీయ మహిళ ఎస్. సెల్వీకి హత్యకేసు నుంచి విముక్తి లభించింది. ఆమె శిక్షను పొడిగించాలన్న ప్రాసిక్యూషన్ అభ్యర్థనను తోసిపుచ్చిన కౌలాలంపూర్‌లోని స్థానిక కోర్టు సెల్వీని విడుదల చేయాల్సిందిగా ఆదేశించింది.

ఇదిలా ఉంటే.. 2006వ సంవత్సరంలో లైంగికంగా వేధిస్తున్న సహోద్యోగి జీ రాజాం అనే వ్యక్తిని హత్య చేసినట్లుగా అంగీకరించిన ఎస్. సెల్వీకి.. స్థానిక కోర్టు నాలుగు సంవత్సరాల జైలుశిక్షను విధించింది. ఆ తర్వాత తన నేరాన్ని అంగీకరించినందుకుగానూ క్షమాబిక్ష ప్రసాదించాలని స్థానిక హైకోర్టును వేడుకుంది. అదలా ఉంటే, సెల్వీ శిక్షాకాలంపై ప్రాసిక్యూషన్ మరో కోర్టును ఆశ్రయించటంతో ఆమె ఇంతకాలం రిమాండ్‌లోనే గడిపింది.

తన లైంగిక వాంఛలను తీర్చాలని హతుడు రాజారాం ఒత్తిడి చేయటంతో.. ఆత్మరక్షణ కోసమే ఆమె అతడిపై దాడిచేసిందని.. ఆమె తరపు న్యాయవాదికి కోర్టుకు విన్నవించారు. కాగా.. ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ప్రాసిక్యూషన్ అప్పీలును తోసిపుచ్చింది. అంతేగాకుండా సెల్వీని తక్షణం విడుదల చేయాలని ఆదేశించింది. దీంతో కోర్టులో కన్నీరుమున్నీరుగా విలపించిన సెల్వీ న్యాయమూర్తులకు కృతజ్ఞతలు తెలియజేసింది.


దీనిపై మరింత చదవండి :