లండన్‌లోని బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో కామన్వెల్త్ బ్యాటన్ రిలే వేడుకలు ఆట్టహాసంగా ప్రారంభమయ్యాయి. బ్రిటన్ రాణి ఎలిజబెత్ ముఖ్య అతిథిగా నిర్వహించే ఈ వేడుకలో కామన్వెల్త్ క్రీడల సమాఖ్య అధ్యక్షుడు మైకేల్ ఫెనెల్ బ్యాటన్ (క్రీడాజ్యోతి)ని ఎలిజబెత్‌కు అందజేశారు. ఆ తర్వాత ఎలిజబెత్ చేతులమీదుగా భారత రాష్ట్రపతి శ్రీమతి ప్రతిభా పాటిల్ అందుకున్నారు.