సంగీత ప్రియులను ఓలలాడించిన అనౌష్క

FILE
ప్రముఖ భారత సితార్ వాయిద్యకారిణి అనౌష్క శంకర్ న్యూయార్క్ సంగీత ప్రియులను తన సంగీతంతో ఓలలాడించారు. వరల్డ్ ప్రీమియర్‌లో భాగంగా ప్రతిష్టాత్మక కార్నేజీ హాల్‌లో జరిగిన "కాన్సెర్టో 3" ప్రదర్శనలో న్యూయార్క్ వాసులను తన సంగీతంతో ఈమె ఆకట్టుకున్నారు.

అనౌష్క సంగీత ప్రదర్శనలో ఆమె తండ్రి, ప్రఖ్యాత సితార్ విద్వాంసుడు పండిట్ రవి శంకర్ సమకూర్చిన సంగీతంతో కార్యక్రమం ఆసాంతం వీనులవిందుగా కొనసాగింది. సితార్ వాయిద్యాన్ని వెస్ట్రన్ ఆర్కెస్ట్రాతో సమ్మిళితం చేసి నిర్వహించిన ఈ కచేరీకి సంగీతప్రియులు లెక్కలేనంతమంది హాజరైనారు. ప్రదర్శనా ప్రాంగణం అంతా క్రిక్కిరిసిపోయారంటే అతిశయోక్తి కాదు.

ప్రతిష్టాత్మకంగా సాగిన ఈ సంగీత కచేరీని "అర్ఫస్ ఛాంబర్ ఆర్కెస్ట్రా"తో కలిసి అనౌష్క నిర్వహించారు. గతంలో ఈమె కార్నేజీ హాల్‌లో తండ్రితో పాటు పదిహేనుసార్లు ప్రదర్శనలను ఇచ్చినప్పటికీ, అనౌష్క ఒంటరిగా ప్రదర్శన ఇవ్వడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

Ganesh|
ప్రదర్శన అనంతం అనౌష్క మాట్లాడుతూ... తండ్రి ఆలపించిన రాగాలను వింటూ, వాటిని సాధన చేస్తూ, తర్వాత వాటిని సితార్‌పై ఆలపించేదాన్నని తెలిపారు. అంతేగాకుండా, వెల్ష్ నిర్వాహకుడు మర్ఫీ సహాయంతో నొటేషన్స్‌పై అవగాహన పెంచుకున్నానని ఈ సందర్భంగా ఆమె వెల్లడించారు.


దీనిపై మరింత చదవండి :